రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై సీఎం కేసీఆర్తో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేశామని వెల్లడించారు. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ పెంచాలని, ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు చెప్పారు. ఈ నెల 31లోగా పదోన్నతులు కల్పించడమే గాక సమస్యలు పరిష్కరిస్తానని సీఎం మాటిచ్చినట్లు పేర్కొన్నారు.
మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో మెదక్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాజేందర్ హాజరయ్యారు. టీఎన్జీవో నూతన డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకముంచాలని రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్రావు దంపతులను ఘనంగా సన్మానించారు.
- ఇదీ చూడండి : కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం