ETV Bharat / state

Mana ooru Mana Badi: ప్రతిపాదనలు అధికం.. నిధులు స్వల్పం

Mana ooru Mana Badi: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ‘మన ఊరు - మన బడి’ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్భాటంగా పనులను ప్రారంభించారు. పలుచోట్ల పనులు చేపట్టినా గుత్తేదారులకు డబ్బు అందడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతుండటంతో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలతో పాటు ప్రస్తుత అసంపూర్తి పనులతో విద్యార్థులు నానాయాతనలు పడుతున్నారు. ఆయా పనుల తీరుపై పరిశీలన కథనం.

ప్రతిపాదనలు అధికం.. నిధులు స్వల్పం
ప్రతిపాదనలు అధికం.. నిధులు స్వల్పం
author img

By

Published : Sep 2, 2022, 12:44 PM IST

Mana ooru Mana Badi: మెదక్ జిల్లాలో తొలి విడతలోనే అత్యధిక పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక స్థాయివే అత్యధికం. అన్నింటా పనులు చేపట్టేందుకు రూ.118.99 కోట్లు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు కేవలం రూ.1.98 కోట్లు మంజూరవడం గమనార్హం. ప్రతిపాదించిన పనుల్లో రూ.30 లక్షల్లోపు ఉన్న పాఠశాలలు 256 కాగా, అంతకంటే ఎక్కువగా 57 వరకు ఉన్నాయి.

మెదక్‌ పట్టణం జంబికుంటలోని బడిలో శౌచాలయం దుస్థితి

చెట్లే దిక్కు.. వంట గదులు లేక చెట్ల కిందే వంటలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. విద్యుత్తు సౌకర్యం కరవై వెలుతురు సరిగా లేని గదుల్లో పాఠాలు వినాల్సి వస్తోంది. చాలా చోట్ల ఫ్యాన్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇక శౌచాలయాలు సరిగా లేక అత్యవసరమైతే నానాతిప్పలు పడాల్సి వస్తోంది.

మధ్యలోనే వదిలేసి.. మనోహరాబాద్‌లో 5 పాఠశాలలు ఎంపికవగా.. రూ.1.16 కోట్లు కేటాయించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శౌచాలయాల మరమ్మతులు, విద్యుదీకరణ పనులు చేపట్టిన గుత్తేదారు నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో వదిలేశారు.

ప్రారంభానికి నోచక..

చల్మెడలో సంపు నిర్మాణం

మెదక్‌తో పాటు మండలంలో 18 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ.4.87 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించారు. మెదక్‌లోని గోల్కోండ ప్రాథమిక పాఠశాలకు రూ.9.48 లక్షలకు గానూ రూ.47,418 మాత్రమే జమయ్యాయి. మిగిలిన 17 చోట్ల ఒక్క పని షురూ కాలేదు. జంబికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో శౌచాలయాలు, మూత్రశాలలు దెబ్బతిన్నాయి. ఓ తరగతి గదిలోనే వంట చేస్తున్నారు.

* కౌడిపల్లి మండలంలో 21 బడులను జాబితాలో చేర్చగా.. పదింటికి స్వల్పంగా నిధులు విడుదలయ్యాయి. రాయిలాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు రూ.23 లక్షలు మంజూరవగా.. కేవలం రూ.81 వేలు మాత్రమే ఎస్‌ఎంసీ ఖాతాలో జమ చేశారు.

* చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.61 లక్షలు రాగా, ఇంతవరకు ఒక్క పని కూడా ప్రారంభించలేదు. టెండర్ల ప్రక్రియనే పూర్తికాలేదు. మండలంలో మొత్తం 15 పాఠశాలలకు రూ.3.43 లక్షలు కేటాయించారు.

* టేక్మాల్‌ మండలంలో 18 బడులను ఎంపిక చేశారు. 15 చోట్ల విద్యుత్తు పనులను ప్రారంభించారు.

* వెల్దుర్తి మండలంలో 12 పాఠశాలలకు రూ.2.52 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు నిర్వహించాల్సి ఉంది.

* రామాయంపేట మండలంలో 18 పాఠశాలలను ఎంపిక చేయగా, వాటిలో పదింటికి నిధులు వచ్చాయి. తొమ్మిది చోట్ల పనులు మొదలవగా, ఒక చోట సాంకేతిక కారణాలతో ప్రారంభం కాలేదు.

* హవేలిఘనపూర్‌లో 16 బడులను ఎంపిక చేయగా.. రూ.30 లక్షలు మంజూరయ్యాయి. చాలా చోట్ల పనులు షురూ కాలేదు.

* పెద్దశంకరంపేటలో 16 బడులు ఎంపిక కాగా తొమ్మిది చోట్ల పనులు కొనసాగుతున్నాయి. నిధులు మంజూరైనా ఇంకా డ్రా కాకపోవడంతో జాప్యం జరుగుతోంది.

* శివ్వంపేట మండలంలో 26 పాఠశాలలు ఎంపికయ్యాయి. 10 శాతం బడులకు పచ్చజెండా ఊపగా పనులు ప్రారంభించారు.

వెలుతురు లేని గదిలో..

...

పాపన్నపేట మండలంలో 21 పాఠశాలలు ఎంపికవగా.. రూ.4.89 కోట్లు మంజూరయ్యాయి. మిన్‌పూర్‌, చీకోడ్‌, కొత్తపల్లి, యూసుఫ్‌పేట ప్రాథమిక పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు నీటి సంపు పనులు, కొంపల్లి, యూసుఫ్‌పేట కాలనీ, యూసుఫ్‌పేట ప్రాథమిక పాఠశాలల్లో విద్యుత్తు పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ ద్వారా రూ.4.38 కోట్లు రాగా, ఇవెక్కడా ప్రారంభం కాలేదు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో వెలుతురు, ఫ్యాన్లు లేని గదిలో పిల్లలు కూర్చుంటున్నారు.

...
...

వేగిరం చేయించేలా చర్యలు

ఆయా శాఖల ద్వారా చేపట్టే పనులను వేగిరం చేస్తాం. ఎంబీ రికార్డులు చేయడం వల్ల గుత్తేదారులకు ఆలస్యంగా డబ్బులు అందుతున్నాయి. నిధులకు కొరత లేదు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు రూ.30 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవి త్వరలో వస్తాయి. గుత్తేదారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారిస్తాం. - రమేశ్‌కుమార్‌, జిల్లా విద్యాధికారి

ఇవీ చూడండి..:

అమలులో చతికిల పడుతోన్న 'మన ఊరు-మన బడి'.. లక్ష్యం చేరేనా..?

భారత నేవీలోకి స్వదేశీ యుద్ధనౌక 'విక్రాంత్'.. జాతికి అంకితమిచ్చిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.