సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించారని మెదక్ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఊరటనిస్తోంది..
అగ్రవర్ణాలలో లక్షలాది మంది నిరుపేదలు ప్రతిభ ఉన్నా బయటకు రాని పరిస్థితిలో ఉన్నారని తెలిపిన ఛైర్మన్.. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఊరటనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ.. పోస్ట్ తొలగించిన నటి