పురపాలిక ఎన్నికల లెక్కింపు సమయంలో ఇబ్బందులు కలగకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పరిశీలించారు.
ఇక్కడ మొత్తం 15 వార్డులు ఉండగా రౌండుకు 5 వార్డులను చొప్పున లెక్కించనున్నట్లు వెల్లడించారు. లెక్కించాల్సిన వార్డును ముదుగానే ప్రకటిస్తూ.. అభ్యర్థులను మాత్రమే లోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తికి సూచించారు.