మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల సమీపంలో లారీలు, టిప్పర్‌లు, ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని..వాటిని నియంత్రించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: నమ్మించి మోసం చేశాడు... వితంతువు ఆవేదన