రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో లింగారెడ్డి కుంటకు గండిపడి నీరంతా వృథాగా పోతుంది.
కుంటకు గండి పడటం 30 ఎకరాల వరి నాట్లు నీట మునుగుతాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గండికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు