కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ లేకపోవడం వల్ల దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయిందన్నారు. . దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆమె చేసిన మేలు మరువలేదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి;"సుష్మా జీ... తెలంగాణకు రావాలనుకున్నారు"