లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి పని పట్టేందుకు మెదక్ జిల్లా పోలీసులు పట్టణంలో డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలతో పట్టణంలోని రాందాస్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, జెఎన్‌రోడ్, మెదక్ డిపో ఏరియా, పాతబస్టాండ్ ఏరియా, చర్చ్ ప్రాంగణంలో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.
అదే విధంగా తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లలో, తూఫ్రాన్-నర్సాపూర్ ఎక్స్ రోడ్, ఆటోనగర్ ఏరియాతోపాటు పలు కాలనీలలో డ్రోన్‌లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలెవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని... వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే ఇంటికి ఒకరు బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుక్కోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:- 14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!