మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో తడవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు కూలిపోయాయి.