కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. స్వయం ఉపాధి వైపే యువత ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ముఖ్యంగా.. సేంద్రియ వ్యవసాయంలోకి దిగుతున్నారు. అలాంటి ఆలోచనలు గల వారికి అండగా నిలుస్తోంది... రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి సంస్థ. మెదక్ జిల్లా తునికిలో ఉన్న ఈ సంస్థ.. ఉచితంగా 6 నెలల డిప్లొమా కోర్సు అందిస్తోంది.
పదో తరగతి అర్హతతోనే ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇటీవల.. 25వ బ్యాచ్ విజయవంతంగా స్నాతకోత్సవం పూర్తి చేసుకుంది. ఇంతకు ఈ కోర్సులో ఏం నేర్పిస్తారు..? సేంద్రియ సాగులో ఎలాంటి నైపుణ్యాలు అందిస్తారు..? కోర్సు అనంతరం భవిష్యత్ ఎలా ఉంటుంది..? తదితర అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
ఇదీ చదవండి:Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్’ ధర రూ.5 పెంపు..