మెదక్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెలరోజుల పాటు (సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు) జిల్లావ్యాప్తంగా 30, 30(ఏ) పోలీసు యాక్ట్ 1861ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ఈ మేరకు పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలెవరూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు జరపకూడదని ఆమె పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో సహకరించాలని ఎస్పీ కోరారు.