మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక గుల్షన్ క్లబ్ నుంచి రామాలయం వరకు ఆర్టీసీ కార్మికులు మౌన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీకి టీఐసీయూ, టీపీటీఎఫ్, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. పేద ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ సంస్థను కాపాడేందుకే కార్మికులు సమ్మెకు దిగారని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కొండల్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టుగానే... తెలంగాణ ప్రభుత్వం కూడా చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: సమ్మెపై వ్యాజ్యం... సాయంత్రం విచారణ