విద్యార్థుల కోలాహలంతో మెదక్ పట్టణంలోని పాఠశాలలు కళకళలాడుతున్నాయి. కరోనా వ్యాప్తితో పది నెలలుగా మూతపడ్డ పాఠశాలలు నేడు సందడిగా మారాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతికి హాజరయ్యారు.
తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకొచ్చిన విద్యార్థులను మాత్రమే పాఠశాల యాజమాన్యాలు తరగతికి అనుమతిస్తున్నాయి. ప్రతి విద్యార్థి మాస్కు ధరించేలా, చేతులు శానిటైజ్ చేసుకునేలా చూస్తున్నారు. కరోనా నిబంధనలు కొత్తగా ఉన్నా.. పది నెలల తర్వాత బడికి వచ్చామన్న ఆనందం విద్యార్థుల్లో కనిపిస్తోందని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి.
ఇదీ చూడండి : విద్యార్థుల సందడి.. మురిసిన బడి