ETV Bharat / state

శనివారం అక్కడ 4 కరోనా కేసులు.. 11 మంది స్వీయ నిర్బంధం - మెదక్ జిల్లా

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా 11 మందిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు రాపిడ్ రెస్పాన్స్ టీం స్పష్టం చేసింది.

శనివారం అక్కడ 4 కరోనా కేసులు.. 11 మంది స్వీయ నిర్బంధం

author img

By

Published : Aug 2, 2020, 2:46 AM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం నాలుగు వైరస్ కేసులు నమోదు కాగా 11 మందిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు రాపిడ్ రెస్పాన్స్ టీం వైద్యుడు విజయ్ కుమార్ తెలిపారు. పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ వ్యాప్తి చెందుతోందని వివరించారు.

త్వరగా వెళ్తే సకాలంలో చికిత్స...

తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి వెళ్తే చికిత్స సకాలంలో అందిస్తామన్నారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు వెల్లడించారు.

ఇవీ చూడండి : కేసీఆర్​ రాష్ట్రాన్ని శ్మశానంగా మారుస్తున్నారు: పూసరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.