ఇక్కడ ట్రాక్టర్ నడుపుతున్నది చోదకురాలు కాదు.. మెదక్ జిల్లా చీలప్చెడు మండలం బధ్యాతండా సర్పంచ్ బుజ్జిబాయి. హరితహారం, పల్లెప్రగతిలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పెట్టడానికి కూలీలు రాకపోవడం వల్ల ఆమె స్వయంగా రంగంలోకి దిగారు.
గత కొన్నిరోజులుగా కూలీలకు సరిపోను వేతనాలు సరిపోడం లేదని వారు రావడం మానేయగా.. తానే ట్రాక్టర్ నడుపుతూ నెలరోజులుగా మొక్కలకు రోజూ నీరు పెడుతోంది బుజ్జిబాయి. సర్పంచ్ చేసిన ఈ పని చాలామందికి ఆదర్శమని... శభాష్ సర్పంచ్ అంటూ స్థానికులు కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి: తెర వెనుక చైనా.. కూపీ లాగుతున్నాం: అవినాష్ మహంతి