ETV Bharat / state

Road Accident 4 persons died : బస్సు- కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Road Accident 4 persons died : మెదక్​లో మూడు రోజుల క్రితం కారు- ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో మరో ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. చికిత్స తీసుకుంటున్న మరో ఇద్దరు ఈరోజు కన్ను మూశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 28, 2023, 1:35 PM IST

4 Members died in same family in Medak District : మూడు రోజుల క్రితం పెళ్లికి వెళ్లి కారులో ఇంటికి వెళుతున్న కుటుంబం ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఘోరమైన ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఈరోజు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరో ఇద్దరు మృతి : మెదక్ - హైదరాబాద్ నేషనల్ హైవే మీద మండల కేంద్రమైన కొల్చారంలో ఈ నెల 26న తేదీన ఆర్టీసి బస్సు- కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడి అక్కడే మృతి చెందగా.. గాయపడ్డ మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగినపుడు కారులో ప్రయాణిస్తున్న పాపన్న పేట మండలం ఎల్లాపూర్​కు చెందిన టేక్మాల్ నాగరాజు(26) అతని అన్న కూతురు హర్షిత(9 నెలలు) స్పాట్ లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు అన్న దుర్గాగౌడ్(35) శనివారం రాత్రి, అతని భార్య లావణ్య( 28) ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అసలేం జరిగిందంటే : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్​ జిల్లాలోని పాపన్నపేట మండలం ఎల్లాపూర్​ గ్రామానికి చెందిన నాగరాజు(32), అతని కుటుంబంతో సహా హత్నూ మండలం దోల్తాబాద్​లో బంధువుల విహహానికి హాజరయ్యారు. పెళ్లి పూర్తయిన అనంతరం కారులో తిరిగి తమ స్వస్థలానికి వెళుతున్న క్రమంలో.. కొల్చారం మండలంలోని జైన మందిర్ వద్ద హైదరాబాద్​కి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ కారును డ్రైవ్​ చేస్తున్న నాగరాజు, తన అన్న కుమార్తె హర్షిత(9 నెలలు) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు అన్న దుర్గగౌడ్​, అతని భార్య లావణ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించారు. కుమారుడు చోటు, రామమ్మకు గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదం విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని హైదరాబాద్​లోని ఓ ప్రవేట్​ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృత దేహాలను మెదక్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అతి వేగమే ప్రమాదకరం : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అతి వేగమే వారి ప్రాణాలను బలిగొంటుంది. వేగంగా వస్తున్న వాహనాలను చూసుకోకుండా రోడ్లను దాటడం, అతి వేగంగా వచ్చి పెద్ద వాహనాలకు, డివైడర్​లను ఢీకొట్టి ప్రమాదాలకు గురవడం లాంటివి తరచుగా జరుగుతున్నాయి. స్పీడ్ లిమిట్ ఇంతా అని ఎన్ని రూల్స్ పెట్టినా వాటిన్నంటిని తుంగలో తొక్కి ప్రాణాలను కోల్పోతున్నారు వాహనదారులు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.