మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెల్దుర్తి మండలం బండ పోసానిపల్లికి చెందిన దాసుగా పోలీసులు గుర్తించారు.
రహదారి నిర్మాణ గుత్తేదారు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాందాస్ చౌరస్తాలో రెండు నెలలుగా పనులు చేస్తున్నా.. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని తెలిపారు. పనుల కారణంగా రహదారి గుంతలుగా మారినా.. పనుల్లో వేగం పెంచలేదన్నారు. ఫలితంగా ఆ ప్రాంతం ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం
..