అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మెదక్ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు విధులు బహిష్కరించినట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?