మెదక్ జిల్లా కేంద్రంలోని రేణుక మాతా ఆలయంలో అమ్మవారికి రూ. 5 లక్షల 21 వేలతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని రూ. రెండు వేలు, ఐదు వందలు, రెండు వందలు, వంద రుపాయలతో ఆలయ పూజారులు శ్రీనివాస్, వేదవ్యాస్, ప్రభాకర్‌లు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని అభిషేకం, సహస్రనామ అర్చన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అధ్యక్షుడు కొండన్ సురేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్‌గౌడ్, యాదగిరి గౌడ్, దామోదర్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా