మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, కిష్టయ్య చెరో ఎకరం కంది పంటను సాగుచేశారు.
ఆ పొలంలో విద్యుత్ నియంత్రిక తక్కువ ఎత్తులో ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి కందిపంట సగం వరకు కాలి బూడిదైంది. గమనించిన రైతులు మంటలు అర్పివేశారు.
విద్యుత్ నియంత్రికను తొలగించమని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
- ఇవీచూడండి: వసతి గృహానికి వెళ్లిన బాలిక అదృశ్యం