మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన రైతులు రామాయంపేట సబ్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. గత కొంతకాలంగా తమకు 2 గంటల కంటే ఎక్కువ విద్యుత్ రావడం లేదని తెలిపారు. ఇలా అయితే పంటలను ఎలా పండించుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోవడం అన్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అని అంటున్నా.. రామాయంపేటలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని రైతులు ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రైతులు తమ ఆవేదనన వ్యక్తం చేశారు. ఎస్సై వచ్చి విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని నచ్చచెప్పటంతో రైతులు ధర్నా విరమించారు.
ఇదీ చూడండి: కంప్యూటర్ల దొంగలు అరెస్ట్.. పరికరాలు స్వాధీనం