మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారితో దేశ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచుతున్నాయని నాయకులు మండిపడ్డారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా... దేశంలో మాత్రం పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోమన్నగారి లక్ష్మీ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.