మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని మూడో వార్డులో రెండు నెలలుగా తాగునీరు రావట్లేదని గ్రామస్థులు ఆందోళన చేశారు. రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పలుమార్లు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదంటూ మహిళలు ఆగ్రహించారు.
ఎంత బాధ ఉంటే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని మహిళలు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.
ఇదీ చూడండి: సంస్కృతి, సంప్రదాయాలకు ఫునర్జీవం: మేయర్