మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోటా వైరస్ వ్యాక్సిన్‌ను నర్సాపూర్ ఎంపీపీ జ్యోతిసురేష్ ప్రారంభించారు. ప్రైవేటుగా కొంటే రోటా వైరస్ వ్యాక్సిన్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని..రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్సీ వైద్యురాలు విజేత సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆంజనేయులు గౌడ్, సర్పంచి వెంకటేష్ గౌడ్, పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: "రేవంత్ నా ముద్దుల అన్నయ్యే కానీ.. 'ఏబీసీడీ'లు బాధించాయి"