మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలను అభివృద్ధి చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఇందుకు సంబంధించి నర్సాపూర్లోని పదిహేను వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వార్డుల కౌన్సిలర్లకు సూచించారు.
అన్ని వార్డుల్లో చేపట్టే పనుల గురించి ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నర్సాపూర్ పట్టణాన్ని తెలంగాణాలోని అన్ని పట్టణాల కంటే ఎక్కువ అభివృద్ధి చేయటానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ మరియు అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వాహ్ తాజ్: ప్రేమాలయం అందాలకు ట్రంప్ ఫిదా