గతంలో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో మాత్రమే కనిపించే ఉద్యానవనాలు.. ఇకపై పల్లెల్లోనూ ఆహ్లాదపరచనున్నాయి. ఉపాధి హామీ పథకం సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మెదక్ జిల్లాలో ఉన్న పల్లె ప్రకృతి వనరులపై వివరణ కోరగా జిల్లావ్యాప్తంగా 256 గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలకు స్థల సేకరణ పూర్తైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు.
గ్రామంలో నిరుపయోగంగా ఉన్న భూమిని ప్రభుత్వం గుర్తించి వాటిని మూడు భాగాలుగా విభజించి మొక్కలు నాటి పెంచాలని శ్రీనివాస్ అన్నారు. పచ్చదనం కోసం గడ్డిని పెంచి ప్రజలను ఆకర్షించేలా సుందరంగా తయారుచేస్తామని వివరించారు. ప్రజలు నడిచేందుకు వాకింగ్ ట్రాక్, యోగా, వ్యాయామం చేసేలా వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో పార్కుకు సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చు అవ్వనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'