అతివేగం ప్రమాదకరమని... ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మెదక్ పట్టణ పీఎస్‌లో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు.
మద్యం సేవించి, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని ఆయన సూచించారు. ప్రతి వాహనదారుడు తమ వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌ను పట్టుకెళ్లాలని తెలిపారు. నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఆయన చెప్పారు.
ఇదీ చదవండిః మందేశాడు... తర్వాత విద్యుత్ స్తంభంపై చిందేశాడు..!