ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మెదక్​ కలెక్టరేట్​ వద్ద ధర్నా - opposition party protest at medak collectorate

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్​, సీపీఎం కార్యకర్తలు మెదక్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సుమారు అరగంట సేపు రాస్తారోకో నిర్వహించగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

opposition parties protest against agricultural bill at medak collectorate
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మెదక్​ కలెక్టరేట్​ వద్ద ధర్నా
author img

By

Published : Sep 25, 2020, 3:53 PM IST

వ్యవసాయాన్ని బడా కంపెనీల నుంచి కాపాడాలని రైతు విద్రోహకర మోదీ వ్యవసాయ సంస్కరణలు తిప్పికొట్టాలని మెదక్​ కాంగ్రెస్​ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు డిమాండ్​ చేశారు. మెదక్​ కలెక్టరేట్​ ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ కాంగ్రెస్​, సీపీఎం, కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు అరగంట పాటు ట్రాఫిక్​ స్తంభించింది.

అనేక విషయాల్లో ఎన్డీయేను బలపరుస్తూ వచ్చిన తెరాస, ఏఐడీఎంకే, బిజు జనతా దళ్​ పార్టీలు.. వ్యవసాయ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మోదీ వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.