మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట మాధవానంద ఆశ్రమంలో కృష్ణా నంద స్వామి ఆరాధనోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భక్తితో ముక్తి..
ఉత్సవాల్లో భాగంగా దర్బార్ కార్యక్రమం జరిగింది. అందులో సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. భక్తితోనే ముక్తి లభిస్తుందని మాధవానంద స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని భక్తులకు సూచించారు.
ఇదీ చూడండి: వివేకానంద జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్