మెదక్ జిల్లా మంబోజిపల్లి మార్కెట్లో ప్రజలు భౌతిక దూరం అనే మాట మరుగునపడేశారు. కూరగాయలు కొనడానికి పెద్దఎత్తున కొనుగోలు దారులు రాగా... మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పక్కనపెట్టేశారు.
జిల్లాలో ఇప్పటి వరకు చేగుంట, పాపన్నపేట మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం తప్పనిసరని... లేకుంటే లాక్డౌన్ కష్టాలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలని మరీమరీ చెబుతున్నారు.