మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మహాశివరాత్రి జాతరకు రాష్ట్రప్రభుత్వం ఆరేళ్లుగా నిధులిస్తోంది. ఈసారి కూడా 75 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో ఆలయానికి ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. కనీస మౌలిక సవసతులు కూడా ఏర్పాటు చేయట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సీసీ రోడ్లు, శౌచాలయాలు లేవని.. అలాగే ఐదేళ్లుగా కడుతున్న యాగశాల పూర్తి కాలేదన్నారు. కల్యాణ కట్ట ఇంకా బేస్మెంట్ దశలోనే ఉందని తెలిపారు. ఏడుపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి ప్రత్యేక నిధులు కేటాయించి.. మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.