దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడుపాయల దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు వనదుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో చివరి రోజైన దసరారోజు అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు ఆలయ ఈవో సారశ్రీనివాస్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: భద్రాద్రిలో వీరలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనం