ETV Bharat / state

జడ్జిని కదిలించిన శివమ్మ 'పింఛను' కష్టాలు.. ఆ తర్వాత ఏం చేశారంటే.. - The judge went to the old woman's house in shabhashpalli

Judge visited old woman's home: మనకేదైనా సమస్య వస్తే అధికారులతో మొరపెట్టుకుంటాం. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతాం. సమస్య పరిష్కరించేలా చూడాలని వేడుకుంటాం. ఇక్కడి వరకూ ఓకే.. కానీ అధికారులు స్పందించి సత్వరమే న్యాయం చేస్తారని చెప్పలేం. ఒక్కోసారి తిరిగితిరిగీ విసుగొచ్చి బాధితులు అక్కడితో వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి. పట్టుబట్టి సాధించుకున్న సంఘటనలూ ఉన్నాయి. కానీ మన సమస్య ఏంటో తెలుసుకుని మన వద్దకే వచ్చి వివరాలు తెలుసుకుంటే.. మనకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశిస్తే.. వినడానికి ఆశ్చర్యంగానే ఉంది. మెదక్​ జిల్లా శివంపేట మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది. నేరుగా న్యాయమూర్తే.. బాధితురాలి ఇంటికి వెళ్లి మరీ సమస్యను తెలుసుకున్నారు.

The judge went to the old woman's house
వృద్ధురాలి ఇంటికి వెళ్లిన జడ్జి
author img

By

Published : Jan 28, 2022, 1:52 PM IST

Judge visited old woman's home: పింఛను రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితురాలి గురించి తెలుసుకున్న న్యాయమూర్తి.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లిన ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాశ్‌పల్లికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలికి రెండున్నరేళ్లుగా పింఛను రావడం లేదు. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా శివమ్మ పింఛను నిలిచిపోయింది. దీంతో ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆమె సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వెళ్లింది. వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లిన జడ్జి.. వివరాలు అడిగారు. ఆమె పండ్లు ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎప్పటి నుంచి పింఛను రావడం లేదో అడిగి తెలుసుకున్నారు.

స్యయంగా న్యాయమూర్తే తన సమస్య తెలుసుకుని ఇంటికి రావడం చూసిన వృద్ధురాలు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో తన గోడు వెళ్లబోసుకున్నారు. 'మీ కాళ్లు మొక్కుతా.. ఎలాగైనా పింఛను వచ్చేలా చూడండి.' అని వేడుకున్నారు. స్పందించిన జడ్జికి శివమ్మకు పింఛను వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

అనంతరం న్యాయమూర్తి.. జిల్లా కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేశారు. వృద్ధురాలికి పింఛను మంజూరయ్యే చూడాలని కోరారు. స్పందించిన కలెక్టర్​ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి నేరుగా జడ్జి గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సభ్యులు వెళ్లారు.

ఇదీ చదవండి: Minister Harish Rao: 'పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకే క్యాథ్​లాబ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.