ETV Bharat / state

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన న్యాక్​ బృందం - telangana varthalu

మెదక్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్​ బృందం సందర్శించింది. కళాశాలలోని వసతులు, లెక్చరర్ల అర్హతలను బృందం పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపాల్​ నరసింహ తెలిపారు.

మెదక్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన న్యాక్​ బృందం

author img

By

Published : Feb 4, 2021, 4:03 PM IST

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం రెండో రోజు సందర్శించింది. వైస్​ ఛాన్స్​లర్​ వర్మ, ప్రొఫెసర్లు కళాశాలలోని వసతులను పరిశీలించారు. రెండు రోజుల సందర్శనలో భాగంగా వారు తొలిరోజు కళాశాల ప్రిన్సిపాల్​ పీవీ నరసింహ పవర్​ పాయింట్​ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం కళాశాలకు సంబంధించిన రికార్డులను, కాలేజీలో పాసైన విద్యార్థుల వివరాలను పరిశీలించారు.

కళాశాలలోని ల్యాబ్​లు, పార్కింగ్​ ప్లేస్​, క్యాంటీన్​, కాలేజీ ఆవరణలో గల ఇంకుడు గుంతలను, హరితహారంలో నాటిన మొక్కలను న్యాక్​ బృందం పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపాల్​ నరసింహ తెలిపారు. లెక్చరర్ల అర్హతలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా న్యాక్ గ్రేడ్​ కేటాయిస్తారని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: తెలంగాణ వార్షిక బడ్జెట్​లో నిరుద్యోగ భృతి అంశం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.