హత్యచేసి ఆత్మహత్యగా చూపించిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్నచింత కుంట గ్రామంలో జరిగింది. సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన పద్మతో నర్సాపూర్ పట్టణానికి చెందిన చెరుకు శివ గత రెండు సంవత్సరాలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఈక్రమంలో శివను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు పేర్కొన్నారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!