ETV Bharat / state

'వీధి దీపాలు ఏర్పాటుచేయాలి.. వార్డుల్లో శానిటైజ్ చేయాలి '

మెదక్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం మున్సిపల్​ ఛైర్మన్ చంద్రపాల్​ అధ్యక్షతను కలెక్టరేట్​ నిర్వహించారు. వార్డుల్లోని సమస్యలు, వివిధ అభివృద్ధి పనులు గురించి కౌన్సిలర్లతో చర్చించి ఏకగ్రీవ ఆమోదానికి వచ్చారు.

municipal chairpersons meet in medak collectorate
మెదక్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం
author img

By

Published : Sep 1, 2020, 12:26 PM IST

మెదక్ కలెక్టరేట్​లో మున్సిపల్ ఛైర్మన్ తోడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన పురపాలక సంఘం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. వివిధ అభివృద్ధి పనుల గురించి ఈ సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. వీధిదీపాలు ఏర్పాటు చేయాలని వార్డుల్లో కరోనా నియంత్రణకై సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారీ చేయాలని కొందరు కౌన్సిలర్లు ఛైర్మన్​ దృష్టికి తీసుకెళ్లారు.

కొవిడ్​ వ్యాధి గ్రస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మరికొందరు కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.