మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేక.. మారుమూల గ్రామంలో ఉండే పేదప్రజలు ఆన్లైన్ బోధనకు దూరమవుతున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించాలని కోరారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలని తెరిచి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు.