ETV Bharat / state

కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారు

కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారంటూ ఓ మాతృమూర్తి కలెక్టర్​ ముందు కన్నీటిపర్యంతమైన ఘటన మెదక్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత మహిళ అంజమ్మ ఫిర్యాదు చేసింది. కష్టించి నిర్మించిన ఇంటిని సైతం అద్దెకిచ్చి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని వాపోయింది. అంజమ్మ పరిస్థితిని విన్న కలెక్టర్​ చర్యలకు ఉపక్రమించారు.

కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారు
author img

By

Published : Jun 10, 2019, 11:51 PM IST

మెదక్​ జిల్లాలో సుదీర్ఘ ఎన్నికల ఘట్టం సందర్భంగా నిరవధిక వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం నేడు తెరుచుకోగానే కన్నీటి ఘట్టానికి వేదికైంది. కన్న కుమారులే తనను పట్టించుకోవడం లేదని.. కనీసం భోజనం పెట్టడం లేదని ఓ మాతృమూర్తి కలెక్టరేట్​ గడప తొక్కింది.

మెదక్​ పట్టణానికి చెందిన అంజమ్మకు నలుగురు సంతానం... హోటల్​ నడుపుతూ కష్టసుఖాలకు ఓర్చుకుని పిల్లలను పోషించానని, ఆ సొమ్మతోనే ఇల్లు కట్టించానని అంజమ్మ తెలిపింది. కానీ తనకు అన్నం పెట్టడమే వృథా ప్రయాసగా వారు చూస్తున్నారని వాపోయింది. కష్టించి నిర్మించుకున్న ఇంటిని అద్దెకు ఇచ్చి తనకు నిలువ నీడ లేకుండా చేశారని కలెక్టర్​ ధర్మారెడ్డి ముందు కన్నీటి పర్యంతం అయింది. అంజమ్మ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన కలెక్టర్​ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంజమ్మ కుమారులకు కౌన్సిలింగ్​ నిర్వించాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిని కలెక్టర్​ ఆదేశించారు. వృద్ధాశ్రమంలో చేర్పించాలని సూచించారు.

కన్న బిడ్డలే కడుపు మాడుస్తున్నారు

ఇవీ చూడండి: భిక్షాటన చేసిన సర్పంచ్​... మళ్లీ నిరసన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.