Modern Anganwadi Center in Medak : రంగులమయంగా కనిపిస్తున్న ఈ పాఠశాల ప్రైవేట్ బడి అనుకుంటే పొరపాటే. కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా కనిపిస్తున్న ఈ కేంద్రం ఎవ్వరు చూసిన ప్రైవేట్ రంగానికి చెందినది అనుకుంటారు. కానీ నిజానికదో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రం. సకల సౌకర్యాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రం మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.
మెదక్ జిల్లా, నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి లో అంగన్వాడీలను కార్పొరేట్ విద్యా లయాలకు దీటుగా రూపొందించడంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు వహిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ అంగన్వాడీకి పిల్లలు ఎంతో ఉత్సాహాంగా అధిక సంఖ్యలో హాజరవుతున్నారని స్థానికులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇంకా పిల్లలకు నచ్చే విధంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి జిల్లాలో ప్రత్యేకంగా ఆరు చోట్ల ఆదర్శ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికల రూపొందించారు.
'' పిల్లలకు, గర్బిణీలకు ఇక్కడే అన్నం పెడతాము. 25 మంది గర్బిణీలకు రోజూ పాలు, గుడ్లు రోజూ అందిస్తాము. అంగన్వాడీ కిచెన్ గార్డన్‌ను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ పండే కూరగాయలతోనే రోజూ పిల్లలకు వంటలు చేస్తాము. ఇక్కడ గోడలకు రంగు రంగుల ఆట బొమ్మలు, కూరగాయల బొమ్మలు వేశాము. అంతకు ముందు అంగన్ వాడీ సెంటర్‌కు ఎక్కువ మంది రాకపోయేవారు. ఇప్పుడు రంగులతో ఆహ్లాదకరంగా వాళ్లకు కావాల్సిన ఆట వస్తువులు, పిల్లలకు నైపుణ్యాలు నేర్పించడంతో ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు.'' -అంగన్వాడీ టీచర్
Modernization of Anganwadi centers : జిల్లా కలెక్టర్ రాజర్శిషా, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ అంగన్వాడీలు అందంగా తయారయ్యాయి. పాఠశాల చుట్టూ రంగురంగుల బొమ్మలు, వివిధ రకాల ఆట వస్తువులు చిన్నారుల మనసులు గెలుచుకునే చిట్టి చిట్టి పరికరాలతో ఆ గ్రామంలో అంగన్వాడీని ఏర్పాటు చేశారు. పిల్లలకు యూనిఫామ్ తో సహా వారికందించే న్యూట్రిషన్ సైతం అద్భుతంగా ఉందని, ఎంతో ఆనందంగా పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు పలువురికీ ఆదర్శంగా నిలుస్తాయని, రాష్ర్టంలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అంగన్వాడీ వ్యవస్థను ముందుకు సాగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇది ప్లే స్కూల్ కాదండి బాబు.. 'అందమైన' అంగన్వాడీ కేంద్రమే..
Thombarraopet Govt School In Jagityala : ప్రైవేటు వద్దు.. సర్కారు బడే ముద్దు..
అంగన్వాడీ టీచర్‌గా మారిన కేంద్రమంత్రి.. విద్యార్థులకు పాఠాలు