రైతుబంధు నగదు రైతులకు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద నగదు జమ చేసినప్పటికీ... వివిధ రకాల కారణాలతో బ్యాంక్ అధికారులు వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన రైతులు తమ బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను ఏపీజీవీబీ బ్యాంక్ అధికారులు బ్లాక్ చేశారని వాపోయారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ… బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుబంధు తీసుకునే విషయంలో బ్యాంక్ అధికారుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ఇదీ చదవండి: 'మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు'