మెదక్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో "మీ కోసం నేనున్నా" అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాపన్నపేట, మెదక్, హావేలీ ఘన్పూర్, నిజాంపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట మండలాల ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
"మీ కోసం నేనున్నా" కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తమ వద్దకు రెవెన్యూ, పెన్షన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి నెల 2, 16 తేదీల్లో మెదక్‌లోని తన క్యాంపు కార్యాలయంలో "మీ కోసం నేనున్నా" కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే వివరించారు. తాను అందుబాటులో లేనిపక్షంలో ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపించాలని సూచించారు.
ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్