ETV Bharat / state

'నర్సరీల్లో మొక్కలు ఉన్నాయో లేదో చూసుకోవాలి' - వర్షాకాలంలో డయేరియా

వర్షాకాలంలో డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున గ్రామాల్లో శానిటేషన్​పై ప్రత్యేక దృష్టి పెట్టాలని… మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మండల పరిషత్​ అభివృద్ధి అధికారులకు ఆమె సూచించారు. హరితహారం కోసం మొక్కలు గ్రామాల్లోని నర్సరీల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

mla Padma Devender Reddy
'నర్సరీల్లో మొక్కలు ఉన్నాయో లేదో చూసుకోవాలి'
author img

By

Published : Jun 11, 2021, 9:36 PM IST

మెదక్​లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy)… క్యాంపు కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పల్లె ప్రగతి క్రింద చేపట్టాల్సిన మొక్కల పెంపకంపై సుదీర్ఘంగా సమీక్షించారు. వర్షాకాలం సీజన్​లో డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున… గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్తను వేరు చేస్తూ డంప్ యార్డులకు తరలించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఏప్పటికప్పుడు నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్​ హరిత హారం కార్యక్రమం చేపట్టి… విరివిగా మొక్కలు నాటి వాతావరణ సమతుల్యానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి గ్రామంలోని నర్సరీల్లో వర్షాకాలంలో నిర్దేశించిన మొక్కలు నాటడానికి… నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలని కోరారు. నిర్మాణాలు పూర్తి కానీ వైకుంఠధామాలు ఒక నెలలోగా పూర్తి చేయాలని చెప్పారు.

ముఖ్యమంత్రి గిరిజన వికాస్ కార్యక్రమం ద్వారా హవేలీ ఘనపూర్ మండల ఎస్.టి. లబ్ధిదారులకు మంజూరైన… ఐదు వ్యవసాయ మోటార్ సెట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్ చంద్రపాల్, మెదక్ నియోజక వర్గ మండల పరిషత్​ అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. మత్తుమందు ఇచ్చి బంధించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.