ETV Bharat / state

'మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యం' - తెలంగాణ వార్తలు

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సాధికారత సాధ్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. అందుకు ప్రభుత్వం తమ వంతుగా సాయం చేస్తోందని పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో నిర్మించిన మంజీరా రూరల్ మార్ట్​ను ఆమె ప్రారంభించారు.

mla padma devendar reddy, manjeera rural mart
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మంజీరా రూరల్ మార్ట్
author img

By

Published : Jun 21, 2021, 2:06 PM IST

మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నాబార్డు నిధులు రూ.5లక్షలతో మెదక్ పట్టణంలో నిర్మించిన మంజీరా రూరల్ మార్ట్​ను సోమవారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని సూచించారు.

మహిళలు చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. చేతితో తయారు చేసిన వస్తువులను నాణ్యతతో అందించాలని సూచించారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని త్వరలో గ్రామాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చావులోనూ వీడని రక్తసంబంధం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వైద్యులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.