కాళేశ్వరం నీటితో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి తాగుసాగు నీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలో గల సాయికృష్ణ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎనిమిది మండలాలకు చెందిన 360 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. గడిచిన నలభై రోజులుగా కరోనా కారణంగా బయటకు రాలేదని తెలిపిన ఆయన.. నియోజకవర్గ ప్రజలకు కాళేశ్వరం నుంచి తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి:అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం