ETV Bharat / state

'సిద్దిపేట నమూనాతో పట్టణాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి' - ఉమ్మడి మెదక్​ జిల్లా అధికారులతో కేటీఆర్​ సమీక్ష

పట్టణాలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో సాగాలని, ఆదాయవనరులు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ వనరుల, విద్యుత్, పారిశుద్ధ్య, తాగునీటి రిసోర్స్ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని, తెల్లరేషన్ కార్డుదారులకు రూపాయికే నల్లా కనెక్షన్ అందించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పురపాలికలపై ఆర్థిక, పురపాలకశాఖ మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్​ సమీక్షించారు.

ktr harish rao
ktr harish rao
author img

By

Published : Jul 10, 2020, 11:10 PM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పురపాలికలపై ఆర్థిక, పురపాలకశాఖ మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్​ సమీక్షించారు. హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న మంత్రి కేటీఆర్... రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీ అయిన సిద్దిపేట నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీల్లో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.

విద్యుత్​ బిల్లులు చెల్లించాల్సిందే..

మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42 అంశాల ప్రాతిపదికగా తీసుకొని... ఓ అభివృద్ధి నమూనా తయారు చేశామన్న మంత్రి... అన్ని మున్సిపాలిటీల్లో అవన్నీ ఉన్నాయో సరిచూకోవాలని సూచించారు. అన్ని పట్టణాల్లోనూ వనరులు, విద్యుత్, పారిశుద్ధ్య, నీటి ఆడిట్ చేపట్టాలన్న కేటీఆర్... ఆదాయవనరులు పెంచే విషయమై దృష్టి సారించి కొత్త మార్గాలను అన్వేషించాలని తెలిపారు. ప్రతి నెలా తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని కేటీఆర్​ స్పష్టం చేశారు. తడి, పొడి చెత్త సేకరణ, డంప్ యార్డుల నిర్మాణం, నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.

ఉదయాన్నే ఫీల్డ్​లో ఉండాల్సిందే..

పారిశుద్ధ్య కార్మికులకు రూ.12,000 జీతం నెల మొదటి వారంలోనే చెల్లించాలని... వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్​లు ప్రభుత్వం తరఫున అందించాలని సూచించారు. ఆగస్టు 15లోగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి మరుగుదొడ్డి ఉండే లక్ష్యంతో పని చేయాలని, అందులో 50 శాతం మహిళా శౌచాలయాలు ఉండాలన్నారు. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో మహిళల శౌచాలయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఉదయం ఐదున్నరకే ఫీల్డ్​లో ఉండాలని కేటీఆర్​ ఆదేశించారు. బయోలాజికల్, బయో మెడికల్, నిర్మాణ-శిథిలాల వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.

మార్పునకు నాంది పలుకుతాం

నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డంప్ యార్డు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వనరుల, విద్యుత్, పారిశుద్ధ్య, నీటి ఆడిట్ నిర్వహించి గుణాత్మక మార్పునకు నాంది పలుకుతామన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా పని చేస్తామని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యర్థాల నిర్వహణా ప్రాజెక్ట్, ఎనిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హరీశ్​ రావు చెప్పారు.

ఆదాయ వనరులు పెంచుకోవాలి

ఆదాయ వనరులు పెంచుకొని మున్సిపాలిటీలు స్వయంసమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సంగారెడ్డి, సదాశివపేట లాంటి మున్సిపాలిటీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామని తెలిపారు. పట్టణాల అభివృద్ధి, వాటిల్లో వచ్చే మార్పు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. పట్టణాలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని కోరారు.

ఇదీ చూడండి : చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.