ఇవీ చూడండి :అభిషేక శివుడు
చల్లంగ చూడు వనదుర్గ - నిరంజన్ రెడ్డి
ఏడుపాయల అనగానే గుర్తొచ్చేది వనదుర్గమ్మవారి ఆలయం. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాల నడుమ విరాజిల్లుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, స్వయంభువుగా వెలిసింది. శివరాత్రినాడు ప్రారంభమైన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పట్టువస్త్రాలు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ఖ్యాతి గాంచింది. ఏటా మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర వైభవంగా ప్రారంభమైంది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శివసత్తుల డప్పు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
ఇవీ చూడండి :అభిషేక శివుడు