Harish Rao distributed two-wheelers and laptops: దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే ముఖ్యమంత్రి KCR దళితబంధు పథకం ప్రవేశపెట్టారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, ల్యాప్ టాప్‌లు పంపిణీ చేశారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన దళితబంధు పథకంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి వందమందికి దళితబంధు ఇస్తున్నామన్న మంత్రి... మార్చి తర్వాత నియోజకవర్గంలోని 2 వేల మంది అర్హులకు పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.
awareness seminar on the Dalitbandhu scheme: దళితులు గౌరవంగా బతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని హరీశ్‌రావు పేర్కొన్నారు. లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రోజులు ఉన్నాయని.. కానీ ఇప్పుడు అలాంటి కష్టం లేదని స్పష్టం చేశారు.
కాలు గడప బయట పెట్టకుండానే అధికారులే మీ వద్దకే వచ్చి దళితబంధు ఇస్తారన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. దళారులను నమ్మొద్దని వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలవాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: CM KCR Comments: 'అవసరమైతే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా'