ETV Bharat / state

Dalitha Bandhu: 'ఫిబ్రవరి మొదటివారంలోపు దళితబంధు లబ్ధిదారుల ఎంపిక' - మంత్రి హరీశ్ రావు

Dalitha Bandhu: ఉమ్మడి మెదక్ జిల్లాలో దళితబంధు అమలుపై హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమావేశమై ఫిబ్రవరి మొదటివారంలోపు లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించారు. మార్చి 5తేదీ నాటికి యూనిట్లు పంపిణీ చేయాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

Dalitha Bandhu
దళితబంధు
author img

By

Published : Jan 28, 2022, 10:27 AM IST

Dalitha Bandhu Scheme: ఉమ్మడి మెదక్ జిల్లాలో దళితబంధు అమలు తీరుపై మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. దళితబంధు అమలు కోసం ఫిబ్రవరి మొదటివారంలోపు ప్రతి నియోజకవర్గంలో 100మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. మార్చి 5వతేదీ నాటికి.. వారి యూనిట్లు గ్రౌండ్ చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

దళితబంధు కోసం తెరిచిన ప్రత్యేక బ్యాంకు ఖాతాలో 9.90లక్షల రూపాయలు జమ చేయాలని.... మిగిలిన 10వేలకు ప్రభుత్వం మరో పది వేలు కలిపి దళిత రక్షణ బంధు ఏర్పాటు చేస్తుందని స్పష్టంచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను.... వెంటనే లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: Road Accident: ప్రాణాలు తీసిన రాత్రి ప్రయాణం.. తండ్రీ కుమారుల దుర్మరణం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.