రాష్ట్ర బడ్జెట్‌లో మూడోవంతుకు పైగా రైతుల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆర్థికమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.... జిల్లాకేంద్రంలో రైతువేదిక ప్రారంభించారు.
రాష్ట్రంలో 600కోట్లతో 2వేల500 రైతువేదికలు నిర్మించామని హరీశ్ రావు తెలిపారు. అవసరమైన చోట కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.... 6వేల రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే రైతుల కష్టాలు తీరాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.