Second Phase Of Kanti Velugu Awareness Program: మొదటి విడత కంటివెలుగు కార్యక్రమంలో కోటీ 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మనోహరబాద్‌లో రెండో విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్ల రూపాయలతో ఈ నెల 18 నుంచి నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. 100 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహించేలా 1500 మంది బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ కంట్రోల్ బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని.. వీళ్లు ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించి నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
"రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి నిర్వహించు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలి. రాష్ట్రంలో ఎవరు దృష్టి లోపంతో బాధపడకూడదు అన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా రాష్ట్ర స్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ టీంలు, జిల్లా స్థాయిలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ టీంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక అందిస్తారు. కంటి వెలుగు బృందానికి ఇప్పటికే ఎల్వి ప్రసాద్, సరోజినీ కంటి ఆస్పత్రిలో శిక్షణ కూడా అందివ్వడం జరిగింది".-హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఇవీ చదవండి: